అర్మాండ్ డుప్లాంటిస్ 14వ సారి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు
స్వీడన్‌కు చెందిన పోల్‌వాల్ట్ స్టార్ అర్మాండ్ డుప్లాంటిస్ తన 14వ ప్రపంచ రికార్డును నెలకొల్పారు. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో సోమవారం జరిగిన పురుషుల పోల్‌వాల్ట్ ఈవెంట్‌లో డుప్లాంటిస్ మూడవ ప్రయత్నంలో 6.30 మీటర్ల ఎత్తు దూకి మూడవసారి వరల్డ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో, హంగేరీలో జరిగిన ఈవెంట్‌లో తాను నెలకొల్పిన 6.29 మీటర్ల రికార్డును అధిగమించారు. సోవియట్ యూనియన్ మాజీ పోల్‌వాల్టర్ సెర్గీ బుబ్కా 13 సార్లు ప్రపంచ రికార్డును తిరగరాశారు, ఇప్పుడు డుప్లాంటిస్ అతన్ని అధిగమించారు.
యునైటెడ్ కింగ్‌డమ్‌లో వలస వ్యతిరేక నిరసనలు, ఎలోన్ మస్క్ మద్దతు
యునైటెడ్ కింగ్‌డమ్ రాజధాని లండన్‌లో వలసదారులకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ర్యాలీ హింసాత్మకంగా మారింది. విదేశీయులను బయటకు పంపించాలన్న డిమాండ్‌తో అతివాద నేత టామీ రాబిన్సన్ పిలుపు మేరకు శనివారం జరిగిన ర్యాలీలో సుమారు 1,50,000 మంది పాల్గొన్నారు., నిరసనకారుల దాడిలో 26 మంది పోలీసులు గాయపడ్డారని మెట్రోపాలిటన్ పోలీస్ విభాగం అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై 24 మందిని అరెస్టు చేశారు. టెస్లా సంస్థ అధినేత ఎలోన్ మస్క్ ఈ నిరసనలను సమర్థించారు, నియంత్రణ లేని వలసల వల్ల దేశానికి భారీ నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు., ప్రస్తుత ప్రభుత్వాన్ని మార్చి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రపంచ వలసల ధోరణులు: పాకిస్తాన్ అగ్రస్థానం, భారత్ మూడవ స్థానం
ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా వలసదారుల సంఖ్య 30.4 కోట్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలను వలసల సమస్య పట్టిపీడిస్తోంది. అత్యధిక వలసలు పాకిస్తాన్ నుండి జరుగుతుండగా, భారత్ మూడవ స్థానంలో ఉందని నివేదికలు తెలియజేస్తున్నాయి.,